కడప జిల్లాలో పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం || వివేకానంద ఫౌండేషన్
చేపను వేటాడాలంటే
ఎర వెయ్యాల్సిందే...
పక్షిని పట్టాలంటే
ధాన్యం చల్లాల్సిందే...
అలాగే... పిల్లలకు నాలుగు మంచిమాటలు చెప్పాలంటే చిన్నచిన్న బహుమతులు ఇవ్వాల్సిందే.
పది మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు త్వరలో పరీక్షలు జరుగుతున్న తరుణంలో వారిని మానసికంగా సిద్ధం చేయాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిత్యం ధైర్యం చెపుతూనే ఉంటారు...
మన వివేకానంద ఫౌండేషన్ తరపున కూడా సామాజిక బాధ్యతగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సంకల్పించాము..
ఊరకే వెళ్లి చెప్పడం కంటే వారికి ఎగ్జామ్ కిట్స్ అందచేసి ఆ సందర్భంగా వారిలో స్ఫూర్తిని నింపాలని తలంచి ఆత్మీయ మిత్రులకు ఈ విషయాన్ని తెలిపాము.
క్రమశిక్షణ కలిగిన పిల్లలు మరియు నిబద్ధత కలిగిన సిబ్బంది వున్న పాఠశాలలను ఎంపిక చేశాము... ఒక్కో కిట్ వంద రూపాయలు పెట్టి 1200 కిట్స్ కొనడం జరిగింది. దీనికి కావలసిన మొత్తాన్ని దాతలు సహకరించడం వలన ఇది సాధ్యం అయింది.
ఈ దాతల్లో పొలాల్లో పనిచేసే కూలీ నుంచి వ్యాపారులు, ఉన్నతోద్యోగులు వరకు ఉన్నారు.
అందరూ ఈ కార్యక్రమాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించి ఆదరించారు.
అందులో భాగంగా అనంతపురం జిల్లాలోని తొమ్మిది పాఠశాలల్లో, కడప జిల్లాలోని 7 పాఠశాలల్లో పంపిణీ చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారులు రాజోలి శ్రీధర్ రెడ్డి అన్న, ఉత్తమ ఉపాధ్యాయులు సనా శ్రీనువాసులు సార్, LIC ఆనంద్ రెడ్డి సార్, సంస్థ ప్రతినిధులు పాతకోట శ్రీనివాస రెడ్డి అన్న, టి. వెంకట సురేష్, యం. రాజశేఖర్ రెడ్డి, కె.కిరణ్ కుమార్, జయరాం , హరి పాల్గొన్నారు..
( సత్యసాయి జిల్లాలో 03 పాఠశాలల్లో పంపిణీ చేయాల్సి ఉంది)
ధన్యవాదములతో...
మీ..
పాపిజెన్ని రామకృష్ణారెడ్డి
వ్యవస్థాపకులు
వివేకానంద ఫౌండేషన్
8897292237